చర్ల, విజయపతాక న్యూస్
చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై రఘు థియేటర్ సమీపంలో పెద్ద గుంతపడి ప్రమాదాలకు నిలయంగా ఉంది. కల్వర్టు దెబ్బ తినడం వలన గుంత పడిందని, త్వరలోనే కల్వర్టు మరమ్మత్తులు చేస్తామని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. గుంత పడిన ప్రదేశంలో వీధిలైట్ల వెలుతురు కూడా లేకపోవడంతో రాత్రిపూట చీకటిలో గుంత కనిపించక ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదాలబారిన పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. చర్లకి చెందిన రౌతు నర్సింహరావు ఇటీవల ఆ గుంతలో పడి గాయాలపాలైనాడు. ఇదే విషయాన్ని విజయపతాక ప్రతినిథి ఆర్అండ్బి డీఈఈ దృష్టికి తీసుకెళ్ళగా గుంత చుట్టు రాళ్ళు, గుంత కనిపించేలా రెడ్ క్లాత్ ఏర్పాటు చేయించారు. అయితే ప్రమాదానికి గురై ఎవరూ ప్రాణాలు కోల్పోక ముందే ఆర్అండ్బి అధికారులు అలర్ట్ అయి కల్వర్టు మరమ్మత్తులు చేయాలని చర్ల మండల ప్రజలు కోరుతున్నారు.










