మార్చి 12, చర్ల, విజయపతాక
తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి దయాకర్‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల చర్ల మండల కాంగ్రెస్ నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. దయాకర్ ఎమ్మెల్సీగా ఎన్నిక ఇక లాంఛనమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులుగా, సామాజిక ఉద్యమనేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అద్దంకి దయాకర్ క్రియాశీల పాత్ర పోషించారని, పార్టీ గెలుపు కోసం తన తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ సీటు కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ళ వైఫల్యాలను నిరంతరం వివిధ రకాల వేదికలమీద వెలుగెత్తి చాటి కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం నిరంతరం కృషి చేసిన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ పదవికే కాదు మంత్రి పదవికి కూడా అర్హుడన్నారు. దయాకర్ ఎమ్మెల్సీ పదవికి వన్నె తెస్తారని మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. పట్టుదల, అంకితభావం కలిగిన అద్దంకి దయాకర్‌ని ఆదర్శంగా తీసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని తోటమల్ల వరప్రసాద్ పిలుపునిచ్చారు.










