సుప్రీంకోర్టు న్యాయవాది పిట్టా శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి
న్యాయవాదుల క్షేమం, సంక్షేమం కోసం Advocate protection ACT ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ లీగల్ సెల్ జాతీయ నాయకులు పిట్టా శ్రీనివాసరెడ్డి కోరారు. ఆ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అడ్వకేట్లకు సంరక్షణ చట్టం అమలులో లేకపోవడం వలన గత ప్రభుత్వంలో హైకోర్టు న్యాయ వాదులు వామనరావు దంపతుల హత్యలు నడిరోడ్ మీద పట్ట పగలు జరిగాయని గుర్తు చేశారు. న్యాయవాదుల హత్యలు, న్యాయవాదుల మీద దాడులు చేయడం వలన న్యాయ వ్యవస్థకు రక్షణ లేకుండా పోయిందని , పోలీస్ వారు false fake కేసులు నమోదుచేసి జూనియర్ న్యాయ వాదులను పొలిటికల్ వత్తిడితో ఇబ్బందికి గురి చేస్తున్నారని పిట్టా శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సివిల్ కేసులలో పలుమార్లు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా జోక్యం చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని, సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి పోలోసులు తమ అధికారాలను పొలిటికల్ వత్తిడితో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పేవారు భక్షణ చేస్తున్నారని, చట్టం అమలు చేయడం మానేసి రాజకీయ నాయకుల వత్తిడితో ప్రమోషన్ కోసం, మంచి ఏరియా పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ కోసం తప్పుడు కేసులు నమోదుచేసి న్యాయ వాదులను వేధిస్తున్నారని పిట్టా శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జూనియర్ న్యాయ వాదులకు నెలకు రూ 10000 స్టైఫండ్ చెల్లించాలని, న్యాయ వాదులు తమ కేసుల వాదనలో తీవ్ర మానసిక వత్తిడికిలోనై గుండె సంబంధిత వ్యాధులకి గురై బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కావున న్యాయ వాదులకు రూ 50 లక్షల మెడికల్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఏర్పాటు చేయాలని, న్యావాదులు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి రూ 30 లక్షల ఇన్స్యూరెన్ క్లెయిమ్ చేసుకునే విధంగా అడ్వకేట్ protection ACTలో పొందు పరిచే చర్యలు తీసుకోవాలని కోరారు. బీద,పేద న్యాయవాదులకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఉచిత గృహములు మంజూరు చేయాలని పిట్టా శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. నూతన హైకోర్టు భవన సముదాయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అడ్వకేట్ కుటుంబం కోసం న్యాయవాదుల కాలనీ నిర్మించి అన్ని విధాలుగా మెడికల్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరుచేసి నూతనంగా రాజేంద్ర నగర్లో నిర్మించే హైకోర్టు నూతన భవన సముదాయంలో నూతన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల పిల్లలకు ఆ మెడికల్ కాలేజీలో విద్యా సౌకర్యం కల్పించాలని కోరారు. న్యాయవాది సంఘాలకు ప్రాణహాని లేకుండా బెదిరింపులు వున్న న్యాయవాదులకు గన్మెన్ సౌకర్యం కల్పించాలని, ప్రజల మేలుకోసం కృషి చేసే న్యాయవాదుల కోసం సంరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు










