ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు ఇర్పా రాజు
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మహిళ సొసైటీల ఆధ్వర్యంలో నడిచే ఇసుక ర్యాంపులను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇర్పా రాజు డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రజల ఉపాథిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంపులను నిలిపిన పాలకులు రేజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు. నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంపుకు పెట్టుబడి నిమిత్తం ముందస్తుగా రూ 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు. ఇసుక అక్రమాలు కట్టడి పేరుతో డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొనకపోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని హెచ్చరించారు










