* సీనియర్ పాత్రికేయులు కొంగూరు రమణారావుని సన్మానిస్తున్న ‘గురుదేవ్’ యాజమాన్యం
విజయపతాక న్యూస్, చర్ల
నమస్కృతి నామంతో ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఘనంగా వార్షికోత్సవ సంబురాలు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని గురుదేవ్ విద్యాలయం వారు ఉత్సవాల ముగింపు రోజు సోమవారం స్థానిక పాత్రికేయులను సన్మానించి మీడియా పట్ల తమ గౌరవభావాన్ని, అభిమానాన్ని ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపాల్ హెచ్ జివి ప్రసాద్, కో ఆర్డినేటర్స్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావులు చర్లకి చెందిన సీనియర్ పాత్రికేయులు కొంగూరు రమణారావు (నినాదం జిల్లా స్టాఫ్ రిపోర్టర్) దొడ్డా ప్రభుదాస్ (సాక్షి టివి) తోటమల్ల రమణమూర్తి (ఆంధ్రప్రభ) జవ్వాది మురళి కృష్ణ (మనం) రుషికుమార్ (నేటి సూర్య), తోటమల్ల గోపాలరావు, మండలోజు వేణుగోపాల చారిలతోపాటు మరికొందరు జర్నలిస్టులను శాలువ కప్పి సన్మానించారు










