దుర్గాప్రసాద్‌‌ని ఆశీర్వదించిన పొదెం

టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ఆకాంక్షించారు. నల్లపు దుర్గాప్రసాద్ జన్మదిన వేడుక ఆయన స్వగ్రామమైన కుదునూరులో బుధవారం సాయంత్రం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పొగళ్ల రాము, సిద్ధి గణేష్, యలగొండ రాకేష్‌ల ఆధ్వర్యంలో జరిగిన నల్లపు దుర్గాప్రసాద్ పుట్టినరోజు వేడుకకి పొదెం వీరయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై దుర్గాప్రసాద్‌ని ఆశీర్వదించారు. చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్‌‌రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సర ప్రారంభ రోజున (జనవరి 1న) దుర్గాప్రసాద్ జన్మదినం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. పార్టీ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం రెండు కళ్ళుగా చేసుకొని పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతీ కార్యకర్త పనిచేయాలని విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షులు పి శ్రీనివాస్, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు వి వినీల్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మడకం పద్మజ, పార్టీ సీనియర్ నాయకులు బండారు రామకృష్ణ, విజయకుమార్ నాయుడు, ఇర్ప శ్రీను యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు జితేంద్ర, జిల్లా మీడియా & కమ్యూనికేషన్ చైర్మన్ దేవా, జిల్లా యస్టీసెల్ వైస్ చైర్మన్ చలపతి, సోషల్ మీడియా కన్వీనర్ రాజా, యస్సి సెల్ కన్వీనర్ సాల్మన్, బీసీ సెల్ కన్వీనర్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS