విజయపతాక న్యూస్, కొత్తగూడెం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకి వచ్చారు. ఆయనకి భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌తో సీఈవో జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 










