విన్నర్ సింగర్ రాహుల్ సింప్లిగంజ్‌ని అభినందించిన సీఎం

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్, సాంస్కృతిక వేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా ఆయా వేదికలపై పలు ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను అభినందించారు. ముఖ్యమంత్రితోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS