* ప్రథమ బహుమతి రూ 50 వేలు, విన్నర్ ట్రోఫీ
* ద్వితీయ బహుమతి రూ 30 వేలు రన్నర్ ట్రోఫీ
విజయపతాక, భద్రాచలం :
29వ నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు డిసెంబర్ 26 నుంచి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్‌లు తెలిపారు. భద్రాచలంలో గత మూడు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న
నెహ్రూ కప్‌కి సంబంధించి ఈసారి షెడ్యూలని మంగళవారం విడుదల చేశారు. టోర్నమెంట్లో విజేతకు రూ. 50 వేలు, ట్రోపి, రన్నర్స్‌కు రూ. 30 వేలు, ట్రోఫీ వీటితోపాటు టోర్నమెంట్లో ప్రతిభ చాటిన వారికి బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తదితర అవార్డ్స్‌తోపాటు వ్యక్తిగత బహుమతులు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగల ప్రముఖ పేరొందిన క్రికెట్ జట్లు డిసెంబర్ 20వ తేదీలోగా తమ ఎంట్రీలను కన్వీనర్ ఎస్ కే సలీం, అబ్బాస్ ఫుట్ వేర్, క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా, భద్రాచలం, సెల్ 9440101108 అనే చిరునామాకు పంపించాలని తెలిపారు.
గత 30 ఏళ్లుగా నెహ్రూ కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని, ఈసారి నిర్వహించే ఈ టోర్నమెంట్ కూడా ఎప్పటిలాగే అందరూ తమ అమూల్యమైన సలహాలు, సహకారం అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ ఎస్కే సలీం, కోశాధికారి కుంచాల సదానందం (సిద్దు) ఉపాధ్యక్షులు గుమ్ములూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు










