మీకోసం మేమున్నాం టీం ఆధ్వర్యంలో చర్ల మండలంలో ఉన్న 11 ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు సామాజిక సేవలు – మానవత్వ విలువలు – మన భాగస్వామ్యం అనే అంశంపై వకృత్వ పోటీలు నిర్వహించారు. నవంబర్ 29న జరిగిన మండల స్థాయి ఫైనల్ కాంపిటేషన్లో చర్ల గురుదేవ్ విద్యాలయం విద్యార్థిని బుహ్యవరపు మాధురి ప్రథమ బహుమతి గెలుచుకొంది. చర్ల సీఐ రాజువర్మ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మాధురి మండల అధికారులు, విద్యావంతలు, పురప్రముఖుల ప్రశంసలు అందుకొంది. గురుదేవ్ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు హెచ్ జి వి ప్రసాద్, అకడమిక్ కో ఆర్డినేటర్స్ ఎం వి. సుబ్రమణ్యం, జి. శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యాయురాలు ఎస్ విశాల తదితరులు బహుమతి గెలుచుకున్న విద్యార్థినికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.










