కనులవిందుగా తేగడ వీరభద్రుని కల్యాణం

* భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం

* 2 వేల మందికి అన్నదానం

 

నాలుగు శతాబ్దాల ఘన చరిత్రకు నిలయంగా.. సరిహద్దు రాష్ట్రాల భక్తులకు కొలిచిన బంగారంగా విరాజిల్లుతున్న తేగడ గ్రామంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ వార్షిక కల్యాణోత్సవం కనులవిందుగా జరిగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఆలయ వార్షిక కల్యాణం, భారీ అన్న ప్రసాద కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు యలమందల శ్రావణ్‌‌‌కుమార్‌, యలమందల భానుప్రకాశ్‌లు భద్రకాళీ, వీరభద్రస్వామి వార్ల కల్యాణ క్రతువును నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, భక్త జనకోటి సహకారంతో కీ.శే మద్ది రామయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు, వంశస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమందల ప్రతాప్‌, వీరభద్రస్వామి, గ్రామస్తులు మద్ది భాస్కర్‌ రెడ్డి, మద్ది సత్యనారాయణ రెడ్డి, కండ్రపు వెంకటరెడ్డి, పొన్నపు సత్యనారాయణ రెడ్డి, యలమందల జగదీష్‌, చింతల రాంబాబు, బండి బాబి, చింతల వెంకటేశ్వర్లు, బోరా పెద్దిరెడ్డి, పొన్నపు సంతోష్‌రెడ్డి, పాగా కిషోర్‌ సహా పలువురు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS