గులాబీ మయమైన ‘చర్ల’

 

ఊరు నిండా జెండాలు.. తోరణాలు

– విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు

– స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరించనున్న బిఆర్ఎస్

విజయపతాక న్యూస్, చర్ల : మండల కేంద్రమైన చర్లలో డిశంబర్ 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ఊరంతా గులాబీ మయమైంది. బిఆర్ఎస్ పార్టీ అడహాక్ కమిటీ కన్వినర్ దొడ్డి తాతారావు, కో కన్వినర్ ఐనవోలు పవన్ కుమార్, సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్‌, కాకి అనిల్, పంజా రాజు తదితరల ముఖ్య నేతల పర్యవేక్షణలో బిఆర్ఎస్ శ్రేణులు ఊరి నిండా జెండాలు, తోరణాలతో అలంకరించి గ్రామాన్ని గులాబీమయం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. నాయకులు ఈ వేదికపై నుంచి మండల బిఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీలను ప్రకటించి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు క్యాడర్‌ని సిద్ధం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణ లక్ష్యంతో జరుగుతున్న ఈ కీలక సమావేశానికి కథనోత్సాహంతో బిఆర్ఎస్ శ్రేణులు తరలిరానున్నారు.

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS