తెలంగాణ పర్యటనకి విచ్చేసిన రాష్ట్రపతి

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్వాగతం పలికారు. నగర మేయర్ విజయలక్ష్మి గద్వాల, ప్రభుత్వ సలహాదారు (ప్రొటొకాల్) హర్కర వేణుగోపాల్ రావు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS