బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా కొండా చరణ్ నియమితులైనారు. ఆ మేరకు బిఎస్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గంధం మల్లిఖార్జునరావు నియామక ఉత్తర్వులు జారీచేశారు. బిఎస్పి రాష్ట్ర నాయకులు ఎర్రా కామేష్, జిల్లా నాయకులు తడికల శివకుమార్ చేతుల మీదుగా చరణ్ నియామకపత్రం అందుకున్నారు. బహుజనుల సమస్యల పరిష్కారం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కొండా చరణ్ తెలిపారు. ప్రజాఉద్యమాల నిర్మాణంలో చరణ్‌ది ప్రత్యేకమైన పాత్ర. ఈయన గతంలో సీపీఎం చర్ల మండల కార్యదర్శిగా, ప్రజాపంథా పార్టీ భద్రాచలం నియోజకవర్గ బాధ్యలుగా పనిచేశారు.










