భద్రాచలం గడ్డ… బిఆర్ఎస్ అడ్డా

తిరుగులేని రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ నిరూపించాలి

సమావేశంలో డివిజన్ నాయకుడు మానె రామకృష్ణ పిలుపు

ద్రాచలం గడ్డపై బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపించుకోవాలని ఆ పార్టీ డివిజన్ నాయకుడు మానె రామకృష్ణ అన్నారు. బిఆర్ఎస్ భద్రాచలం పట్టణ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారని మానె ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. ప్రజాపోరాటాలకు క్యాడర్ సిద్ధం కావాలన్నారు. ఈనెల 27న భద్రాచలంలో జరిగే పార్టీ జనరల్ బాడీ సమావేశం సందర్భంగా జరిగే మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఆరోజు భద్రాచలం పట్టణం గులాబీమయం కావాలని పిలుపునిచ్చారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపి మాలోత్ కవిత, జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్, నియోజకవర్గ నాయకులు తాండ్ర వెంకటరమణ, మండల పార్టీ కన్వీనర్లు దొడ్డి తాతారావు (చర్ల), కణితి రాముడు (దుమ్మగూడెం) పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మండల నాయకులు బత్తుల నరసింహులు, కోలరాజు, అయినాల రామకృష్ణ, అంబటికర్ర కృష్ణ, ఏడుకొండలు, బాడిస నాగరాజు, కీసర యువరాజు, కాపుల సూరిబాబు, బద్ది బాబి, ఆకోజు పృద్వి, రాసాల శివ, డానియల్ ప్రదీప్, రవి వర్మ, ఇమంది నాగేశ్వరరావు, రాజుదేవర నాగరాజు, మహిళా నాయకులు ప్రియాంక, గౌస్య, ఇమామ్ ఖాసిం, బాబు, నాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS