భద్రాచలం ఏజెన్సీలో స్థానిక విద్యార్థులకు సౌకర్యంగా ప్రభుత్వం న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని జిఎస్‌పి ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందివీరయ్య, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాయం సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలం ఐటిడిఏ లీగల్ సెల్ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో సోంది వీరయ్య మాట్లాడుతూ, భద్రాచలం ఏజెన్సీలో స్థానిక ఆదిమ జాతుల కోసం ఒక న్యాయ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతంలో స్థానిక ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఓబీసీలు విద్యా రంగంలో ముఖ్యంగా న్యాయ శాస్త్రంలో రాణించవచ్చని అన్నారు. ఏజెన్సీలో విద్యార్థులకు న్యాయశాస్త్రంలో శిక్షణ ఇప్పిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించి డాక్టర్ అంబేద్కర్ వారసులను తయారు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
గోండ్వానా గర్జన సదస్సు జయప్రదం చేయండి
డిసెంబర్ 28,29,30 తేదీలలో హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే గోండ్వానా గర్జన సదస్సును జయప్రదం చేయాలని జిఎస్‌పి ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందివీరయ్య, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పరిసిక సోమరాజు, కొర్సా కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.










