
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని సందర్శించారు. ఆసుపత్రిలో ఏఆర్టి సెంటర్, పిల్లల సంరక్షణ కేంద్రం, ల్యాబ్స్, లేబర్ రూమ్స్,క్యాసువాలిటీ, ఆయుర్వేద వైద్యశాల విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ఎంవో డాక్టర్ సంతోష్, డా. విజయరావు, డా. శ్రీనిధి, డా ప్రమీలరాణిలతో మాట్లాడి ఆసుపత్రి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఎమ్మెల్యే వెంట భద్రాచలం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.










