భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసుల్లో పట్టుబడిన రూ 2.80 కోట్ల విలువైన 1132 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.డిస్పోజల్ కమిటీ అధికారి డిప్యూటి కమిషనర్ జి జనార్థన్‌రెడ్డి అదేశాల మేరకు ఏడబ్ల్యుఎం కన్సటింగ్ వారి తల్లాడ మండలం గోపాల్‌పేట్ దహన కేంద్రంలో ఈ గంజాయి దహనం చేయించారు. ఖమ్మం డిప్యూటి కమిషనర్ జి జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ జి గణేష్, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీమ్ ఉన్నీషా బేగం సమక్షంలో గంజాయి దగ్ధం చేయించారు. గంజాయి దహనం చేయించిన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.










