రైతులతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పి రోహిత్ రాజు


రైతులు శ్రమటోడ్చి పండించిన వరి ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారి వ్యాపారులకు అమ్మి మోసపోవద్దని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పి రోహిత్ రాజు అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్పి సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పి పర్యటనలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్, చంద్రుగొండ ఎస్ఐ స్వప్న పాల్గొన్నారు.










