గ్రామీణ వైద్యురాలు సుధారాణి తన తల్లి స్వర్గీయ కాండ్రాకోట శేషమాంబ జ్ఞాపకార్థం వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యాలయానికి సుమారు రూ 6 వేల విలువైన 1000 లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంకు వితరణగా ఇచ్చారు. శుక్రవారం దాన్ని నిలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాతలు గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసి విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శేషమాంబ మనవడు రాజేష్ వనవాసి ప్రాంత మహిళ సహ కార్యదర్శి పెద్దాడ ఆశాలత, కోరం సూర్యనారాయణ, జవ్వాది మురళీకృష్ణ వేములపల్లి ప్రవీణ్ కుమార్, రామలక్ష్మణ్, గొంది ప్రసన్న, శ్రావణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.










