భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం‌ మానవత్వం

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్షతగాత్రుల‌ పట్ల మానవత్వం చూపించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. శుక్రవారం చర్ల మండల పర్యటన ముగించుకొని భద్రాచలం వెళుతూ మార్గమధ్యంలో ఓ ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉన్న క్షతగాత్రులను చూసి ఎమ్మెల్యే చలించి పోయారు. ఎమ్మెల్యే వెంకట్రావు స్వతహాగా వైద్యులు కావడంతో ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి పలు సూచనలు చేశారుతీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే తన వాహనంలో ఎక్కించుకొని భద్రాచలం ఆసుపత్రికి చేర్చారు. ఎమ్మెల్యే పీఏ కళ్యాణ్ సైతం మరో ఇద్దరు క్షతగాత్రులను మోసుకుంటూ తీసుకెళ్ళి అంబులెన్స్‌లో ఎక్కించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS