రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో విద్యార్థుల బతుకమ్మ సంబరం

విజయపతాక న్యూస్, చర్ల / సెప్టెంబర్ 20

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో విద్యార్థులు శనివారం ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరం నిర్వహించుకున్నారు. ఆదివారం నుంచి విద్యార్థులకు దసరా సెలవులు కావడంతో విద్యార్థులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. అయితే అందరూ కలిసి బతుకమ్మ సంబరం జరుపుకోవాలనే ఆలోచనతో శనివారం చివరి వర్కింగ్ డే సందర్భంగా ఈ బతుకమ్మ సంబరం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు రంగురంగుల పూలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయం కనువిందు చేసేలా బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ బతుకమ్మ సంబరంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వర్మ రాజు, ఉపాధ్యాయులు జనార్ధన్, మాధురి, మౌనిక, లావణ్య, శిరీష, సుప్రియలతోపాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS