- విజయపతాక న్యూస్, దుమ్మగూడెం
దుమ్మగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటప్పయ్యను భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోర పెద్దిరెడ్డి (చర్ల) సన్మానించారు. మావోయిస్టు ప్రభావిత చర్ల, దుమ్మగూడెం మండలాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి అధికారుల మన్ననలు, ఏజెన్సీ ప్రజల ప్రశంసలు పొందారు. తాలూరి వెంకటప్పయ్య దుమ్ముగూడెం ఎస్ఐగా పనిచేస్తూనే ఆగస్టు నెలలో ప్రమోషన్ పొంది దుమ్ముగూడెం సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఐ వెంకటప్పయ్యని పెద్దిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
దుమ్మగూడెం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సంపూర్ణ సహకారం అందిస్తారని వెల్లడించారు.










