విజయపతాక న్యూస్, చర్ల
గణేష్ నవరాత్రుల మహోత్సవాలు సెప్టెంబర్ 1వ తేదీ సోమవారంనాటికి 6వ రోజుకి చేరుకున్నాయి. ఐదు రాత్రులు పూర్తి కావడంతో సోమవారం నుంచి పలు మంటపాల్లోని గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవాలు ఆరంభించారు. ఈ సందర్భంగా ఆటపాటల నృత్యాలతో భారీ ఊరేగింపులు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు సైతం రంగులు చల్లుకొని జై.. బోలో గణేష్ మహరాజ్‌కీ అంటూ దిక్కులు పిక్కటిల్లే విధంగా నినాదాలు చేశారు. ఈసారి ఊరేగింపుల్లో ఈసారి అశ్లీల సినిమా పాటలు, నృత్యాలు లేకపోవడంతో ఇళ్ళ ముందుకు వచ్చిన స్వామి వారిని భక్తిశ్రద్ధలతో ఇంటిల్లిపాదీ దర్శించుకొని ప్రసాదాలు, కానుకలు సమర్పించుకున్నారు. 










