మాల మహానాడు జిల్లా కన్వినర్‌గా ‘తోటమల్ల రమణమూర్తి’

రాష్ట్ర నాయకుల సమక్షంలో ఏకగ్రీవ ఎన్నిక

విజయపతాక న్యూస్, చర్ల 

జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్‌‌గా చర్ల మండలానికి చెందిన
తోటమల్ల రమణమూర్తి ఎన్నికైనారు. శనివారం పాల్వంచ పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో జరిగిన మాల మహనాడు ముఖ్య శ్రేణుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి అశోద భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్‌రావుల సమక్షంలో ఈ ఏకగ్రీవ ఎన్నిక జరిగినట్లుగా జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడెళ్ళ గణపతి వెల్లడించారు. జాతీయ మాల మహనాడుని గ్రామస్థాయిలో పటిష్ఠ పర్చి ఎస్‌సి వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మాలలను సంఘటితంగా భాగస్వాములను చేయడంలో, స్వయంగా తనే బాధ్యతలు చేపట్టి భద్రాచలం నుంచి ప్రారంభించిన పాదయాత్ర (రాష్ట్ర జాతా) విజయవంతం చేయడంలో రమణమూర్తి చేసిన కృషికి ఫలితంగా ఈ పదవి లభించడం అభినందనీయమని మాల మహనాడు నాయకులు కొంగూరు రమణారావు, తడికల లాలయ్య, కొంగూరు నర్సింహరావు, సాల్మన్, బోళ్ళ వినోద్, కొంగూరు సత్యనారాయణ తదితరులు అభినందించారు. ఈ పదవి ద్వారా రమణమూర్తి అందరిని సమన్వయం చేస్తూ జిల్లాలో మాల మహనాడుని పటిష్టపర్చి మాలల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS