చర్ల అదనపు ఎస్‌ఐ‌గా కేశవ్ బాధ్యతలు స్వీకారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్ఐ‌గా కేశవ్ బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం దుమ్మగూడెం పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహించిన కేశవ్ బదిలీపై వచ్చి చర్లలో జాయిన్ అయ్యారు. అనంతరం చర్ల సీఐ రాజువర్మని మర్యాద పూర్వకంగా కలిశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్లలో శాంతి భద్రతల కోసం తనవంతు బాధ్యతలు నిర్వహిస్తానని, అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కేశవ్ కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS