చర్లలోని రాహుల్ విజ్ఞాన్ విద్యార్థిని ఆత్మకూరి రుత్విక సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ అండర్ -10 బాలికల విభాగం 300 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికైంది. డిసెంబర్ 1న మంచిర్యాలలో జరిగే అథ్లెటిక్స్‌లో ఈ విద్యార్థిని పాల్గొంటుందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్బంగా రత్వికని, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్‌లను రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం చైర్మన్ డాక్టర్ డి ఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ, డైరెక్టర్ టీవీపీసీ శాస్త్రిలతోపాటు ప్రిన్సిపాల్ వర్మ రాజు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది అభినందించారు.










