అమాయక ఆదివాసీలను చంపడమే మావోయిస్టు పోరాటమా…?

రమేష్‌ … అర్జున్‌ల హత్యలపై ఆదివాసీల ఆగ్రహం

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీల రాస్తారోకో

ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇన్‌ఫార్మర్‌ నెపంతో రమేష్, అర్జున్‌లను మావోయిస్టులు హత్య చేయడంపై ఆదివాసీలు ఆగ్రహానికి గురైనారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి 163వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జంట హత్యలపై ఆగ్రహంతో మావోయిస్టులు డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ఆదివాసీలను హత్య చేయడమేనా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోసం ఆదివాసీలను హత్య చేయడం ఏంటని ఆదివాసీలు ప్రశ్నించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను దారుణంగా నరికి చంపడం అమానుషమని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్‌, అర్జున్‌ హత్యలపై ప్రజాసంఘాలు స్పందించాలని డిమాండ్‌ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS