అధికారులకు విద్యార్థుల విన్నపం
మాకు రోడ్డు కావాలి అంటూ చదువుకునే పిల్లలు అధికారులను కోరుతున్నారు. అసంపూర్తి రోడ్డుపై అవస్థలు పడుతూ ఆటోల్లో బడికి వెళ్ళి రావడానికి పడరాని పాట్లు పడుతున్నామని చిన్నారులు వాపోతున్నారు. చర్ల మండలంలో గోదావరి తీరంలోని సుమారు పది గ్రామాలను కలుపుతూ దండుపేట నుంచి సి. కత్తిగూడెం వరకు చేపట్టిన లింకు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయిన రోడ్డుని ఇప్పటికైనా పూర్తి చేయాలనే ఆలోచన భద్రాచలం ఎమ్మెల్యేకిగానీ, సంబంధిత అధికారులకుగానీ లేకపోయింది. దీంతో అసంపూర్తి రోడ్డుపై అవస్థలు పడుతున్న విద్యార్థులు అధికారుల దృష్టిని ఆకర్షించేలా మాకు రోడ్డు కావాలని నినాదాలు చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియా గ్రూపులలో పోస్టు చేశారు.










