భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చర్ల మండల బిఆర్ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిలో చర్ల మండలం నుంచి ముమ్మనేని అరవింద్, పోటు బ్రహ్మానందరెడ్డి, పోలిన లంకరాజు, ఇర్ఫా వసంత్ తదితర ప్రముఖులు ఉన్నారు.










