ప్రెస్‌మీట్‌లో ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు
విజయపతాక న్యూస్ : తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు భద్రాచలం పట్టణ పర్యటన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మళ్లీ తెలంగాణలో శ్రీరాముడి పాలన వస్తుందన్నారు.ఖచ్చితంగా తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పాలన గాలికివదిలి పక్క రాష్ట్రలలో ప్రచారానికి వెళ్ళారని హేళన చేశారు అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, నాయకులు ఎందుకు వెళ్లామా అని తలలు పట్టుకుంటున్నారని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన ఎవరిని కూడా తిరొగి పార్టీలోకి తీసుకోము అన్నారు. కాంగ్రెస్‌కి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఏడాది కాకుండానే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్‌కి ఎందుకు ఓట్లేశామా అని ఇప్పుడు తెగ బాధపడుతున్నారని తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వంపై ప్రజలు కసితో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజల చేతిలో పరాభవం తప్పదన్నారు.










