స్వాగతం పలికిన భద్రాద్రి కలెక్టర్, ఐటీడీఏ పివో
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, జిల్లా ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిటీ సభ్యలతో కలిసి ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.










