భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీని గురువారం లెక్కించారు. హుండీ ద్వారా రూ. 1,03,21,415 ఆదాయం భక్తుల నుండి వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి తెలిపారు. 90 గ్రాముల బంగారం, వెండి 900 గ్రాములు హుండీలో భక్తులు సమర్పించుకున్నారని తెలిపారు.










