తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
జన్మదిన వేడుకని ఈసారి రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క (అనసూయ) మహారాష్ట్రలో జరుపుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార బాధ్యతల్లో ఉన్న సీతక్క అక్కడి పార్టీ కార్యకర్తల సమక్షంలో రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఫోన్ చేసి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ప్రశంసలు అందుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రజల దీవెనలతో ఇలాగే ముందుకు సాగాలని సీతక్క ఆకాంక్షించారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యాలుగా రేవంత్ర్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని సీతక్క ప్రశంసించారు. ప్రజల కోసం పరితపిస్తున్న రేవంత్‌రెడ్డికి దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆమె కోరారు