గురుదేవ్ విద్యాలయంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

జూలై 14, విజయపతాక న్యూస్, చర్ల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని గురుదేవ్ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లభాష యందు చక్కని అవగాన కల్పించాలనే సంకల్పం, ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఐఎల్‌ఎం బెంగులూరు వారిచే శిక్షణా తరగతులు ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్‌‌జివి ప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్, సందీప్ (ILM బెంగులూరు ప్రతినిథి) చేతుల మీదుగా టీచర్స్ సమక్షంలో లాంఛనంగా ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హెచ్‌జివి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ప్రోగ్రాం ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనా విద్యార్థుల ఉన్నతి కోసం ILM బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకొని ఈ విద్యా సంవత్సరం (ఈరోజు) నుంచి తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకు కుమారి సౌజన్య శిక్షణ ఇస్తారని తెలిపారు. తాము అడిగిన వెంటనే సుదూర ప్రాంతం నుంచి వచ్చి శిక్షణ ఇవ్వడానికి అంగీకరించిన ILM బెంగులూర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గురుదేవ్‌లో ప్రత్యేక ఇంగ్లీష్ శిక్షణ ప్రారంభం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS