ఎంఈవో చేతుల మీదుగా ఏటీఏ క్యాలెండర్ ఆవిష్కరణ

విజయపతాక న్యూస్, చర్ల
మండల విద్యా వ్యవస్థను మెరుగుపరిచి విద్యాభివృద్ధిని సాధించడంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ (ఏటిఏ) సంపూర్ణ సహకారం అందించాలని చర్ల మండల విద్యాశాఖ అధికారి పివి రమణ కోరారు. సోమవారం ఉదయం చర్ల ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ని ఎంఈవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘం ఏటీఏకి తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, అలాగే ఏజెన్సీలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సంఘ పరంగా మీ వంతు కృషి చేయాలని కోరారు. ఎవరైనా పని చేయకపోతే తనకు చెప్పాలని సూచించారు. ఏటిఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సవలం వీరస్వామి మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీల హక్కుల, చట్టాల కోసం ఆదివాసి సమాజ అభివృద్ధి కోసం ఏటిఏ ఆవిర్భవించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటిఏ రాష్ట్ర నాయకులు బెండబోయిన సత్యనారాయణ, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ రామారావు, టి. లక్ష్మీపతి గౌరవ సలహాదారులు సోయం శేషు, గౌరవ అధ్యక్షులు తుర్రం సావిత్రి, ఉపాధ్యక్షులు దేశ ధనలక్ష్మి, కోశాధికారి మెండి రాజ్ కుమార్, ఏటిఏ కార్యవర్గ సభ్యులు సోయం శ్యామ్ కుమార్, కొర్సా రాజబాబు, వల్లే వెంకట్రావు, తాటి శ్రీనివాసరావు, సోయం చిన్నయ్య, తోలె శ్రీనివాసు, మడకం సుజాత, పరిసిక అరుణ, పరిసిక రాజు, నూతన టీచర్స్ జి బాలసత్య, శ్రీదేవి, కె నవీన్, పి మహేష్, కె. శంకర్, టీ పాండురాజు, ఎన్ బాబురావు, కామరాజు, ఎం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










