చర్ల మండల పర్యటనకు విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు డిశంబర్ మొదటి వారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్ల మండల పర్యటన ఖారారయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వెంట మంత్రిని కలిసిన వారిలో చర్ల పిఏసిఎస్ చైర్మన్, డిసిఎంఎస్ డైరెక్టర్ పరుచూరి రవికుమార్ ఉన్నారు.










