వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

  • ఆసుపత్రులకు అనుమతులు తప్పనిసరి
  • భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌‌పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది యొక్క అర్హతను ఆసుపత్రికి వచ్చే రోగులకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే అర్హతకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టెందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించి తక్షణ చికిత్స అందేందుకు జియో ట్యాగింగ్ చేయాలని, ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో, రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల యొక్క ధరల పట్టికను ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐఎంఎ అధ్యక్షులు అరికల భాస్కర్ మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అనుమతులు లేని ఆసుపత్రులను, క్లినిక్ లాబ్‌లను సీజ్‌ చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సభ్యులు డా. మధువరన్, డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్, ఉమా మహేశ్వరీ, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS