ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో
భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ రమాదేవి ఆలయ సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే దంపతులకు వేదపండితుల నడుమ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటు, తన కృషితో భద్రాద్రి రాముని ఆలయంసహా నియోజకవర్గం అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని సీతారాముల వారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీడియాకి తెలిపారు.










