మీకోసం మేమున్నాం కమిటీ ఆధ్వర్యంలో పాతచర్ల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రతీ ఆదివారం నిర్వహించే అన్నదానం కార్యక్రమాన్ని ఈ 154వ వారం ఈర్ని సీతారత్నం జ్ఞాపకార్ధం వారి కోడలు ఈర్ని పద్మావతి స్పాన్సర్ చేశారు. పద్మావతి పంపిన రూ 5 వేల వితరణతో సుమారు 200 మందికి ఉచితంగా భోజనాలు పెట్టినట్లు సంస్థ చైర్మన్ నీలి ప్రకాష్ తెలిపారు. ప్రతీ ఆదివారం చర్లలో జరిగే వారపుసంతనాడు చత్తీస్గఢ్ అటవీప్రాంత ఆదివాసీలతోపాటు స్థానిక పేదలకు భోజనాలు పెట్టి ఒకపూట ఆకలి తీరుస్తున్నామని తెలిపారు పేదవారి ఆకలి తీర్చడమనే పుణ్యకార్యాన్ని 154 వారాలుగా నడుపుతున్నామని, ఈ మహోన్నత కార్యక్రమానికి ఎందరో దాతలు ముందుకొచ్చి తమవంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని అరవింద్, సుంకరి భగవాన్, దొడ్డి రమణారావు, శిరిపురపు శివ, దొడ్డా ప్రభుదాస్, పాశికంటి సంతోష్, ఉమ్మలేటి మల్లికార్జునరావు, రేగల్ల వెంకటరమణ, ఏకుల విజయ్ ప్రసాద్, సొల్లంగి నాగేశ్వరరావు, పరిశుద్దం, భద్రం తదితరులు పాల్గొన్నారు.












