భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిథిలోని చర్ల, భద్రాచలం, దుమ్మగూడెం మండలాల బిఆర్ఎస్ కమిటీలను రద్దు చేసిన బిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆయా మండలాలకు కన్వినర్, కో కన్వినర్లతో తాత్కాలిక కమిటీలను ప్రకటించారు. చర్ల మండల కన్వినర్‌గా దొడ్డి తాతారావు, కో కన్వినర్‌గా ఐనవోలు పవన్ కుమార్ నియమితులైనారు. దుమ్మగూడెం మండల కన్వినర్‌గా కణితి రాముడు, కో కన్వినర్‌గా ఎండి జానీ, భద్రాచలం టౌన్ పార్టీ కన్వినర్‌గా ఆకోజు సునీల్ కుమార్, కో కన్వినర్‌గా రేపాక పూర్ణచంద్రరావులను ప్రకటించారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం అనంతరం పూర్తి స్థాయి కమిటీలను నియమిస్తామని రేగా తెలిపారు.











